5, అక్టోబర్ 2011, బుధవారం

ఎఱుగ లేక

ఎఱుగ  లేక నిన్ను తుదకు శరణుజొచ్చినవి
పరమాత్యుని యింద్రియములు పట్టగల్గునే

కన్ను లేరీతి నిన్ను కనుగొన గలవు
నీ వెలుగుల వలన కాంచ నేర్చు నీ కనులు

వాక్కు లేరీతి నిన్ను వర్ణించ గలవు
ఓంకార జలధి తరగ లైన వీ  వాక్కులు

మనసు యేరీతి నిన్ను భావించ గలదు
నీవు నడిపించు నటుల నడచు నీ మనసు

2 కామెంట్‌లు:

 1. chalaa baagundi. Meenundi ituvanti kavitalu marinni asistunnamu

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీమూర్తిగారు,
   ఈ గేయం మీకు నచ్చినందుకు సంతోషం.
   తప్పకుండా మరిన్ని వ్రాయాలనే ఆశిస్తున్నాను.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.