వేయికి మిక్కిలి జన్మము లాయె వేచిన దింక చాలునయా మాయ నుండి నను దయతో విడుదల చేయవె నీదరి చేరగ నీవె |
|
కడు ముచ్చట పడి యడిగితి సరియే పుడమికి నవ్వుచు పంపితి విచ్చట నడుగిడి యుగములు జన్మలు పెక్కులు గడిపితి నీతో నడిపితి నెయ్యము | |
గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము విడువని నిన్నేమని పొగడుదును నడుచెద నిటు నీ యడుగుల నడుగిడి ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి |
|
బడుగు వీ డని తలపవు రామా కుడిపెద వోహో కరుణామృతము కడలి కంటె గంభీరము నీ హృది బడలనీక నను పాలించెదవు |
|
22, జులై 2015, బుధవారం
వేయికి మిక్కిలి జన్మము లాయె
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)