అన్నము పానము హరినామమే యనగ నున్న మాకు పొట్టతిప్ప లన్నవి గలవే |
|||
వింతవింతరుచులపైన వెఱ్ఱిమోహములవి లేవు వింతవింతహరికథలను వినెడు మోహ మొకటె గాని ఎంత మంచిభోజన మన్న చింతయెన్నడును లేదు సంతతశ్రీరామనామచింతనాసక్తియె గాని |
అన్న |
||
దినదినమీ పొట్ట కెంత తిండితీర్థములతోడ మనుజుడు బ్రతుకంత సేవ మానకుండ జేయు గాని తనివితీరునది లేదు తనకు మోక్షప్రాప్తి లేదు కనుక రామభజనమందు తనియుచుందుమెపుడు గాన |
అన్న |
||
హరినామామృతపాన మదియె చాలునన్న తెలివి తరచుగాను కలుగు రామదాసులైన వారి యందు నరులయందు కుక్షింభరులై నడువకుండు వార మగుట తిరముగ శ్రీరాముడు మమ్ము కరుణ జూచుచుండు గాన |
అన్న |
||
21, జులై 2015, మంగళవారం
అన్నము పానము హరినామమే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)