16, జులై 2012, సోమవారం

గత మెంచి యడిగేది కాదనవు గదా ప్రతిసారి వలె పోయి రమ్మనకు

గత మెంచి యడిగేది కాదనవు గదా

ప్రతిసారి వలె పోయి రమ్మనకు

అలవాటే కద నీకు అందుకే వేరొక

తలకాయ తగిలింతు తైతక్క లాడర

యిల మీద క్రొత్త కథ వెలయించరా యని

సెలవిత్తు వేమొ మరి చిత్తమొల్లని పని

వేప చెట్టు జన్మము పాపఱేని జన్మము

కోపాలసుండైన భూపతి జన్మము

పాపవిదూరయోగివరుడైన జన్మము

ఈ పాట్లు పడు పారు డెత్తినవే గద

అనుభవములు చాలు హాయిగాను తొంటి

ఘనమైన స్వస్థితి కలిగించవయ్య

మనమిర్వురము నొక్కటని పల్కుచునె నను

తనువుల దాల్చగ తరుమకు మయ్య

5 కామెంట్‌లు:

  1. శ్యామలీయం గారు,

    భాగవతం రెండో స్కందం చదువుతున్నాను. అందు లో కొన్ని పదలైతే ఇంతక్రితం విన్నాను కాని, అర్థం స్పష్ట్టంగా తెలియలేదు.

    1. ఆ పదాలు దృష్ట్ట, రసం, సత్తు అసత్తు
    2. తేజస్సు నుండి రసం,రూపం,స్పర్శం, శబ్ద్దం అనే నాలుగు గుణాలతో పాటు జలం జనించింది. ఇక్కడ రసం అంటే అర్థమేమిటి?

    3." మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకార అంశంతో శబ్బతన్మాత్ర పుడుతుంది. శబ్దతన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశ అంశంతో స్పర్శ తన్మాత్రం పుడుతుంది. తేజస్సు అంశం నుండి రసతన్మాత్ర పుడుతుంది, రసతన్మాత్ర అంశమ్నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశంతో పృధ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిక వలన పదునాలుగు భువనాల స్వరూపమైన విరాడృపం ఉద్బవిస్తుంది "

    Thanks in advance.

    SriRam
    పై వాఖ్యంలో మహత్తత్త్వం, తన్మాత్రం ,గంధ తన్మాత్ర అంటే అర్థమేమిటి?

    రిప్లయితొలగించండి
  2. శ్యామలీయం గారు,

    Thanks in advance

    SriRam

    రిప్లయితొలగించండి
  3. అయ్యా శ్యామలీయంగారు,
    నెను ప్రతి గంటకు మీరేమైనా బదులిచ్చారాని చుస్స్తున్నాను. మీకు జవాబు ఇవ్వటం వీలుకాకపోతే చెప్పండి. ఎమీ అనుకోను.

    SriRam

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్‌గారు,

      చాలా మంచి విషయం అదడిగి నందుకు మీకు నా హృదయపూర్వకమైన అబినందనలు. మిమ్మల్ని ప్రతీక్షింప జేస్తున్నందుకు మన్నించాలి. తప్పకుండా మీకు విపులమైన జవాబు చెబుతాను. మీరు విచారానికి లోనుకావద్దని మనవి. అన్యథా భావించ వలదు. మీ రడిగినది నాకు మిక్కిలి యిష్టమైన విషయమే.

      ఆలస్యానికి కారణం సాధారణమైనదే. నేను ప్రస్తుతం ఉద్యోగస్థుడనే కదా. నా ఔద్యోగికదినచర్య ఉదయం 8 గంటలనుండి మొదలై సాయంత్రం 6 గంటల వరకూ సాగుతుంది. అందు చేత నాకు తరచుగా రాత్రి వేళల్లో మాత్రమే వ్రాసే‌ అవకాశం దొరుకుతుంది. మీ ప్రశ్నలకు నే నీరోజే సమాధానం వ్రాయ ప్రయత్నిస్తాను. సమాధానం కొంచెం విపులంగా ఉండే పరిస్థితి. కాబట్టి ఒక టపా వస్తుందేమో. మీకు మరీ సంతోషం అనుకుంటాను. జిజ్ఞాసువులకు సహాయపడటం దైవారాధనమే కాబట్టి నాకు మిక్క్లి సంతోషకరమైన యీ పనిని చాలా శధ్ధగా చేస్తాను.

      భవదీయుడు,
      తాడిగడప శ్యామలరావు, హైదరాబాదు, 98496 26023

      తొలగించండి
    2. Thank you so much sir. I would wait for your post

      SriRam

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.