శ్రీరామచంద్రుని చేరవే చిలుకా
ఆ రామచంద్రుని అడుగవే చిలుకా
చిరునగవులను చిందు శ్రీరామచంద్రుడు
కరుణ కలిగిన వాడు కసరడే చిలుకా
హరి చెంత చేరవే ఆనందపరచవే
మురిపాలమాటల ముద్దుల చిలుకా పంచవెన్నెల చిలుక మంచిచిన్నెల చిలుక
కొంచెము నామాట గోవిందు నడుగవే
మంంచిమాటలు చెప్పి మన్నింపుమని యడిగి
ఇంచుకంతగ విషయ మెఱిగరా చిలుకా
మరియెన్ని గండాలమారి జన్మల నెత్తి
తరియింతునో నేను తనను నీ వడుగవే
హరి నడిగి తెలిసికొని ఆమాట చెప్పవే
సరిసాటిలేని ఓ చక్కన్ని చిలుకా