28, మార్చి 2013, గురువారం

కనుగొనుమా మహాత్మ

చ. కనుగొనుమా మహాత్మ  క్షణకాలము ముందర నిన్ను గూర్చి నా
మనసున నున్న భావముల మంచిపదంబుల చంపకంబులన్
గొని తనివార కూర్చుటకు కొంత ప్రయత్నము చేయ సిధ్దమై
తిని విను మంతలో మరొక దిక్కున కేగెను బుధ్ధి రాఘవా 

(వ్రాసిన తేది: 2013-1-25 )