25, డిసెంబర్ 2025, గురువారం
రామరామ యనవే
22, డిసెంబర్ 2025, సోమవారం
వచ్చితినయ్యా
వచ్చితినయ్యా రామయ్యా
వచ్చితినయ్యా నిన్నుచూడగా
వచ్చితి సీతారామయ్యా
మెచ్చి నీవు వర మిచ్చెద వనుకొని
వచ్చితి ననుకొన వలదయ్యా
ఇచ్చుట మానుట నీయిష్టమురా
యినకువతిలకా రామయ్యా
గ్రుచ్చి యెత్తి నను కౌగలించుకొని
కుశలం బడిగొదొ రామయ్యా
గ్రుచ్చి గ్రుచ్చి నీకోరచూపులతొ
కుళ్ళబొడిచెదవొ రామయ్యా
ముచ్చటగా నీగోత్రనామముల
నిచ్చట మార్చుట వింటినిరా
హెచ్చుగ కటకటపడి భద్రాద్రి
ముచ్చట తలపక యుంటినిరా
మెచ్చని నీవును శ్రీరఘునాయక
మిన్నకుండుటను చూచితిరా
ముచ్చటగా నాహృక్షేత్రమునకు
విచ్చేయుమురా విహరింప
నిచ్చలు సీతారాముడ వని నిను
ముచ్చటగా నే కొలిచెదరా
చచ్చు తెలివి నీగోత్రనామముల
సరిదిద్దక నే కొలిచెదరా
అచ్చపు తెలివిడి నన్నివేళలను
హరి సర్వాత్మక కొలిచెదరా
మచ్చరించ హర బ్రహ్మాదులు మన
సిచ్చి నిన్ను సేవింతునురా
వివరింపవే
శ్రవణసుభగంబుగా వివరింపవే
నారాయణుని దివ్యనామామృతము చాలు
వేరేల పల్క నని వివరింపవే
నారాయణుని చరణంబులే చాలునే
వేరేల మ్రొక్క నని వివరింపవే
నారాయణుని పద్మనయనంబులే చాలు
వేరేల చూడ నని వివరింపవే
నారయణుని కరుణ నాకు గల్గిన చాలు
వేరేల కోర నని వివరింపవే
నారాయణుని కథల నాలకించిన చాలు
వేరేల వినగ నని వివరింపవే
నారాయణుని యర్చనంబు చేసిన చాలు
వేరేల చేయ నని వివరింపవే
నారాయణుడు చాలు నారాయణుడు చాలు
వేరేల దైవ మని వివరింపవే
నారాయణుని రామనామ మొక్కటి చాలు
వేరేల తరియింప వివరింపవే
20, డిసెంబర్ 2025, శనివారం
రక్షరక్ష
రక్షకు డింకొక డెవ్వడు లేడు నిరాకరించ కయ్యా
రక్షరక్ష శ్రీరామచంద్ర హరి కుక్షిస్థాఖిలభువన
రక్షరక్ష హరి సీతానాయక రామచంద్రవదన
రక్షరక్ష సురగణపరిపాలన రాక్షసగణహరణ
రక్షరక్ష హరి భక్తజనావన రామలోకశరణ
రక్షరక్ష భవతారణనిపుణ పక్షిరాజగమన
రక్షరక్ష హరి సత్యపరాక్రమ రామసర్వశరణ
రక్షరక్ష సంసారనివారణ రామపాపహరణ
రక్షరక్ష హరి కారణకారణ రామ పరబ్రహ్మ
రక్షరక్ష శ్రీరామా జగదారాధితశుభచరణ
రక్షరక్ష శ్రీరామా సంసారార్ణవైకతరణ
రక్షరక్ష శ్రీరామా రాఘవ రాజకులాభరణ
రక్షరక్ష శ్రీరామా హరి నారాయణ భవహరణ
రామరామ
రామరామ రామరామ రామ రాఘవా
రామ రవికులాబ్ధిసోమ రామ సకల సుగుణధామ
రామరామ మునిజనైకకామ రాఘవా
రామరామ సీతారామ రామరామ కృపాధామ
రామరామ శ్రీవికుంఠధామ రాఘవా
రామ నీలమేఘశ్యామ రామ మునిమనోభిరామ
రామరామ హరసన్నుతనామ రాఘవా
రామరామ రాజారామ రామరామ విజయరామ
రామరామ దైత్యగణవిరామ రాఘవా
రామ తాపశమననామ రామ పాపహరణనామ
రామరామ వరవితరణనామ రాఘవా
రామరామ ఆప్తకామ రామరామ పరంధామ
రామరామ భవతారకనామ రాఘవా