25, డిసెంబర్ 2025, గురువారం

రామరామ యనవే

రామరామ యనవే శ్రీ
  రామరామ యనవే రఘు
రామరామ యనవే జయ
  రామరామ యనవే

రామనామనిత్యజప
  పరాయణుడను నే ననవే
రామనామ మొకటి చాలు 
  రక్షించగ నన్ననవే
కాము డనే వాడు నా
  కడకు రాడు పొమ్మనవే
ఏమరియును నితరుల నే
  నెంచబోను పొమ్మనవే

రాముడు గా కితరుల
  నారాధించను పొమ్మనవే
రాముని చరితమును గా
  కేమి చదువ బొమ్మనవే
రామునితో గాక మాట
  లాడ బోను పొమ్మనవే
ఓమనసా రామునొకనె
  ప్రేమించెద నేననవే

రామభజన చేయువారి 
  కేమి భయము లేదనవే
రాము డున్నచోట శుభ
  పరంపరలే లెమ్మనవే
రాముడే భగవంతుడని
  భూమి మీదను చాటవే
ప్రేమతోడ మోక్షమిచ్చు 
  రాముడొకడు చాలనవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.