వివరింపవే బాగ వివరింపవే మనస
శ్రవణసుభగంబుగా వివరింపవే
శ్రవణసుభగంబుగా వివరింపవే
నారాయణుని దివ్యనామామృతము చాలు
వేరేల పల్క నని వివరింపవే
నారాయణుని చరణంబులే చాలునే
వేరేల మ్రొక్క నని వివరింపవే
నారాయణుని పద్మనయనంబులే చాలు
వేరేల చూడ నని వివరింపవే
నారయణుని కరుణ నాకు గల్గిన చాలు
వేరేల కోర నని వివరింపవే
నారాయణుని కథల నాలకించిన చాలు
వేరేల వినగ నని వివరింపవే
నారాయణుని యర్చనంబు చేసిన చాలు
వేరేల చేయ నని వివరింపవే
నారాయణుడు చాలు నారాయణుడు చాలు
వేరేల దైవ మని వివరింపవే
నారాయణుని రామనామ మొక్కటి చాలు
వేరేల తరియింప వివరింపవే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.