6, నవంబర్ 2011, ఆదివారం

నీ కోసం కట్టిన యీ గుడిలో రాకాసులు యెటులో చేరినవి


నీ కోసం కట్టిన యీ గుడిలో
    రాకాసులు యెటులో చేరినవి
నీ కొలువు కెవరూ రాకుండా
    వాకిటనే అవి కాపుండినవి

రసనారాజద్వారము ముంగిట
    నామము లాడుట యాగినది
చెవుల గుమ్మముల చెంగట మ్రోగే
    శుభగుణ గానము లాగినవి

నేత్రద్వారములందిచే శుభ
    హారతి వెలుగులు సమసినవి
సకలద్వారముల పూజాప్రకరణ
    విధులను మూకలు మూసినవి

దేహాలయమున నరిషడ్వర్గము
    దూరిన దెటులో తెలియదయా
పూజలాగినవి వేగమె వాటిని
    తరిమే దెటులో తెలుపవయా

5 కామెంట్‌లు:

  1. దేహదేవాలయంలో చేరిన అరిషడ్వర్గాల గురించిన మీ గేయం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. నిస్సందేహంగా ఇది చాలా చాలా మంచి కవిత.భేష్. భాషా వికాసం గురించి మీరు రాసిన వ్యాసం కూడా ఆలోచింపదగీనదీ కవిత్యం రాసేవారికి కనువిప్పు కలిగించేదిగానూ ఉంది.

    రిప్లయితొలగించండి
  3. chalaa bagundi. mee numchi inkaa manchi kavithalu asistunnamu. nirantara kavitha prakriya meenityakrutyamkaavali

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.