ఈ యానందము నీ కెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ యుత్సాహము నీ కెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ నిర్మోహత నీ కెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ నిస్సంగత నీ కెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ విజ్ఞానము నీ కెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ వైరాగ్యము నీ కెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ శమ మీదమ మివి యెక్కడివి ఈశ్వర నీవే యిచ్చినవి ఈ శాంతమనఃస్థితి యెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఈ రామజపం బిది యెక్కడిది ఈశ్వర నీవే యిచ్చినది ఏరా గడితేరితి విక పోరా ఈశ్వర అంతా నీ దయరా |