హరేరామ యని యనిశము పలికే నరోత్తములకే మోక్షము
హరేకృష్ణ యని చిందులు త్రొక్కే నరోత్తములకే మోక్షము
హరినే తల్లిగ దండ్రిన నెంచే నరోత్తములకే మోక్షము
హరియే బంధువు గురువని యెఱిగిన నరోత్తములకే మోక్షము
పరదైవతమగు హరినే కొలిచే నరోత్తములకే మోక్షము
పరాత్పరుని శుభనామము మరువని నరోత్తములకే మోక్షము
హరిసేవల కంకితమై యుండెడి నరోత్తములకే మోక్షము
హరికీర్తనమున పరవశమందెడి నరోత్తములకే మోక్షము
హరి కన్యుల తామెన్నడు తలపని నరోత్తములకే మోక్షము
హరిభక్తిని తామెన్నడు విడువని నరోత్తములకే మోక్షము
హరిని మనసులో తిరముగ నిలిపిన నరోత్తములకే మోక్షము
హరిని జగము లందన్నిట గాంచే నరోత్తములకే మోక్షము
పరమాప్తుండని రాముని తలచే నరోత్తములకే మోక్షము
పరమప్రియుడని కృష్ణుని తలచే నరోత్తములకే మోక్షము
హరినామము గల దన్యము వలదను నరోత్తములకే మోక్షము
హరిపాదంబుల నుండుట చాలను నరోత్తములకే మోక్షము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.