హరినామం మన హరినామం నిరుపమాన మగు హరినామం
అఖిలలోకముల కాధారముగా నమరియుండునది హరినామం
అఖిలలోకముల కన్నిట రక్షగ నమరియుండునది హరినామం
అఖిలలోకముల కమృతమనగా నమరియుండునది హరినామం
అఖిలలోకముల నమితపూజ్యమై యమరియుండునది హరినామం
అందరు విబుధుల జిహ్వాగ్రంబుల నమరియుండునది హరినామం
అందరు విబుధుల హృదయంబులలో నమరియుండునది హరినామం
అందరు విబుధుల కభయము నిచ్చుచు నమరియుండునది హరినామం
అందరు విబుధుల కైశ్వర్యముగా నమరియుండునది హరినామం
సుమతుల కనిశము కర్ణపేయమై యమరియుండునది హరినామం
కుమతుల హృదయఛ్చేదము చేయుచు నమరియుండునది హరినామం
విమలబుధ్ధులకు మోక్షప్రదమై యమరియుండునది హరినామం
విమలంబగు శ్రీరామనామమై యమరియుండునది హరినామం
శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
రిప్లయితొలగించండిశ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము ||రామనామము||
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామనామము ||రామనామము||
నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము ||రామనామము||
శ్యామలరావుగారు ఈ కీర్తన ఎవరు రాసేరో గాని అత్యంత ప్రాచుర్యం పొందింది . మీ కీర్తన కూడా దీనిని పోలి
చక్కగా ఉంది
అవునా అండీ. మీరు చెప్పిన "రామనామము రామనామము రమ్యమైనది రామనామము" అన్నది బహుళ ప్రచారం పొందినది. అది ఆర్కీవ్స్ సైట్ లోపల ఉంది. ఎక్కడుందో వెదకి పొష్టుచేస్తాను వీలైతే.
తొలగించండి"అఖిలలోకముల కాధారముగా, అఖిలలోకముల కమృతమనగా, అందరు విబుధుల కైశ్వర్యముగా" అన్నచోట్ల "గ"ను మార్చితే బాగుంటుంది కద!ఛందస్సు,యతి,ప్రాస వంటి నియమాలు అడ్డొస్తున్నాయా?
తొలగించండివూరికే పాడుతుంటే "గా"కు దీర్ఘం ఇచ్చి ఆగి వెంటనే "న"కు మళ్ళుతుంటే దమ్ములో జర్క్ వొస్తుంది,అందుకని.అయితే, అచ్చులో ఇలా ఉంచి పాడేతప్పుడు "అఖిలలోకముల కాధారముగ నమరియుండునది హరినామం" అమి పాడటానికి అభ్యంతరం ఉందా!
దమ్ములో జర్కు ముక్కులో తుమ్ము అంటూ గానామృతాన్ని మార్చేస్తారాండీ ? మీ దమ్ము ను ముక్కు చీమిడి సరి చేయాలిగాని ?
తొలగించండిహరిబాబు గారు, గానసౌలభ్యాన్ని బట్టి చిన్నచిన్న మార్పులు సహజమండీ. ఐతే అర్ధం మారిపోయేలాగు కాని అసహజంగా ఉండే లాగు కాని, వినటానికి ఇబ్బందిగా ఉండే లాగు కాని సాహిత్యాన్ని మార్పుచేయకూడదు. సాహిత్యం అలాగే ఉండాలి. పాడటంలో కొంచెంగా బాణీని బట్టి హ్రస్వదీర్ఘాదులు వస్తూ ఉండవచ్చును.
తొలగించండిఐతే కొందరు అత్యుత్సాహంగా సాహిత్యానికి మెఱుగులు దిద్దబోయి పాడుచేస్తూ ఉంటారు. వారికి దురుద్దేశం లేకపోయినా ఒక్కోసారి జరిగిన అపకారం సామాన్యులకు తెలియకపోవచ్చును. దీనికి మంచి ఉదాహరణ.
అదివో అల్లదివో హరివాసము
పదివేలు శేషుల పడగలమయము
అన్న అన్నమయ్య సంకీర్తనమే.
ఎవరో మహానుభావులు శ్రీహరివాసము అని మార్చి ప్రచారంలోనికి తెచ్చారు. అలాచేస్తే యతిభంగం అవుతున్నది. అది వారికి తెలియలేదు. అన్నమయ్య తన సాహిత్యంలో యతిప్రాసలను నియతిగా పాటించారు. అందువల్ల జరిగినతప్పు సాహిత్యలోకానికి తెలిసిపోయినా, జరిగిన తప్పును దిద్దటం కష్టంగా ఉంది.
అందుచేత సాహిత్యాన్ని గమనికగా పాడుతూ ఉంటే సరిపోతుంది.