24, ఫిబ్రవరి 2015, మంగళవారం

మన టీవీ‌ సీరియళ్ళుఏడుపులు మొత్తుకోళ్ళు
అరుపులు పెడబొబ్బలు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

మతిలేని కథనాలు
వింతవింత మళుపులు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

కుట్రలు కూహకాలు
ఎత్తులు పైయెత్తులు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

ఐనా ఈ‌ ఆడవాళ్ళు
వాళ్ళ కింతలేసి కళ్ళు
వాళ్ళే కుళ్ళు సీరియళ్ళు
చూస్తారప్పగించి కళ్ళు

విలన్లంతా ఆడవాళ్ళు
చూస్తే తిరిగేను కళ్ళు
అబ్బబ్బో ఆ విసుళ్ళు
జ్వాలాతోరణాలు ఇళ్ళు

చీకటి పడగానే మగాళ్ళు
చేరుకుంటారు వాకిళ్ళు
టీవీ రణరంగాలా యిళ్ళు
ఐనా కిమ్మనరాదు వాళ్ళు

చూడు డబ్బింగు సీరియళ్ళు
అబ్బో అవి ఇళ్ళా రాజమహళ్ళు
ఆ పట్టుచీరల కష్టాల కావళ్ళు
కళ్ళల్లో మోస్తారు మన ఆడవాళ్ళు

వదలక చూస్తూ  ఆ పటాటోపాలు
అవుతున్నారు కోచ్ పొటాటోలు
దాంతో డబ్బులు మందులపాలు
గట్టిగా అంటే కోపతాపాలు


9 వ్యాఖ్యలు:

 1. బాగా చెప్పారు. అలాగే ఆ అరగంట ఎపిసోడ్ వస్తున్నంతసేపూ ఎడతెరిపిలేకుండా వినిపించే భయంకరమైన నేపధ్య సంగీతం(?), ప్రతి డైలాగుతోనూ / సీను మార్పుతోనూ కత్తి దూస్తున్నప్పుడు కలిగే శబ్దం గురించి కూడా పైన కవితలో పొందుపర్చవచ్చు. అబ్బో ఆటవికత తాండవిస్తుంటుంది మన టీవీ సీరియళ్ళలో. ఈలోగా వీటి ఛానెఅసలు సీరియళ్ళు తమ మేధస్సు ని అవమాన పరుస్తున్నాయి అనే ఆలోచన కూడా ఉండటం లేదులా వుంది చూసేవాళ్ళకు. ఈనాడు సమాజంలో కనిపిస్తున్న / పెరిగిపోతున్న పశు ప్రవర్తన, అమర్యాదకర ప్రవర్తనల కి కూడా ఈ టీవీ సీరియళ్ళు బాధ్యత వహించాలని చెప్పాలి. టీవీ సీరియళ్ళు లాంగ్ రేంజ్ లో సమాజం మీద మరింత దుష్ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఎంతైనా వుంది. టీవీ సీరియళ్ళకి కూడా సెన్సార్ బోర్డ్ ఉండాలి.
  అసలు ఈలోగా వీటి ఛానెళ్ళ మీద గృహహింస కేసు పెట్టటానికి వీలవుతుందేమో చూడాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరే సీరియల్ గురించి చెబుతున్నారో నాకు తెలియటం లేదు కాని దాదాపు అన్ని సీరియళ్ళదీ ఒకటే ధోరణి. ప్రేక్షకుల బుఱ్ఱను తినటం.
   ౧. టీవీ సీరియళ్ళకి కూడా సెన్సార్ బోర్డ్ ఉండాలి. మంచి ఆలోచన. కాని అసమంజసమైన విషయాలపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఇప్పటికే ఉంది. కాని నేటి సమాజంలో సామంజస్యాన్ని సరిగా నిర్వచించలేని పరిస్థితి కదూ?
   ౨. వీటి ఛానెళ్ళ మీద గృహహింస కేసు అలోచన దివ్యంగా ఉంది. అప్పుడు, తమకు ప్రీతిపాత్రమైన సీరియళ్ళని మూయిస్తూ గృహహింసకు పాల్పదుతున్నారని మహిళామణులు పురుషపుంగవులపై తప్పకుండా గృహహింస కేసులు వేస్తారు. తస్మాత్ జాగ్రత జాగ్రత.

   తొలగించు
  2. 1. నేను అందుకోసమని కూర్చుని ఏ సీరియలూ చూడనండి. ఇంట్లోవాళ్ళు చూస్తున్నప్పుడు ఆ శబ్దాలు వద్దనుకున్నా చెవిలో పడుతుంటాయి - టీవీకి వ్యతిరేక దిశలో కూర్చున్నా కూడా. ఆ రకంగా అబ్బిన పరిజ్ఞానం మాత్రమే.
   2. ఏ ఎపిసోడ్ మీదని కంప్లైంట్ చెయ్యాలి, ఏ సన్నివేశం / సంభాషణ మీదని కంప్లైంట్ చెయ్యాలి - అన్నీ అసమంజసంగానే తోస్తాయి. ఇవన్నీ భారీ వ్యాపారాలు కాబట్టి స్వీయనియంత్రణ వున్నట్లు లేదు. అందుకని సెన్సార్ బోర్డే వుండాలి.
   3. గృహహింస కేస్ గురించి మీరు చెప్పిన ప్రమాదం కరక్టే.

   తొలగించు
 2. టి.వి.సీరియళ్ళు చూడ్డం మానేసి సుఖపడ్డానంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవి చూసే తీరికా కోరికా నాకు ఎప్పుడూ‌ లేవండీ. చూసే వాళ్ళు మానేస్తే సుఖపడతారన్నది నిజమే కావచ్చును. కానీ, ఇంట్లో మిగిలినవాళ్ళు తప్పకుండా సుఖపడతా రన్నది మాత్రం పచ్చి నిజం.

   తొలగించు
 3. శ్యామలీయం గారు ,

  శుభ సాయంత్రం .

  మన తెలుగు టీ వి సీరియల్స్లో ఏమాత్రం రియాలిటీ లేనివే .
  ఓ నాటికి మన ఆడవాళ్ళే మనకు విలన్లైపోతారేమోనన్న ఆందోళన కూడా కలిగే ప్రమాదం లేకపోలేదు .
  కధ సాగక పలు సినిమాలలోని పాటలను , దృశ్యాలను కాపీ చేసి మరీ చూపిస్తునారు . మగవాడిని హీనంగా కూడా చూపించటం అధికమైంది . డబ్బు కక్కుర్తితో చాలా మంది , వాళ్ళ కెంతో ధనమున్నా , నికృష్టమైన పాత్రలలో నటిస్తూ , కళాపోషణ అని పైకి చెప్పుకొంటున్నారు .
  మీ తో ఏకీభవిస్తున్నాను .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "మన తెలుగు టీ వి సీరియల్స్లో ఏమాత్రం రియాలిటీ లేనివే"

   రియాలిటీ షోలు అనబడే వాటిలోనే రియాలిటీ లేనప్పుడు సీరియళ్ళలో ఆశించకూడదు లెండి!

   తొలగించు
 4. టీవీ సీరియల్స్ బాబోయ్ అనిపిస్తున్నాయి. ఇది వరకు లాగా విచిత్ర కాశి మజిలి కథలు, తెనాలి రామకృష్ణ, రాజశేఖర చరిత్ర లాంటి సీరియల్స్ వస్తాయేమో అని ఆశ. మీకు తెలుసో లేదో మీట్ mr ఆంజనేయులు అని దూరదర్శన్ లో మధ్యాహ్నం 12 కి వచ్చేది చాల బాగుంటుంది. నేను స్కూల్ నుంచి రోజు ఆ సీరియల్ కోసం వచ్చేవాడిని (మా అమ్మ ఎందుకురా ఎండలో వస్తావు ఒక వేళ లేట్ అయితే మీ మాస్టర్ తిడతారు అన్న వినిపించుకొనే వాడిని కాదు. అప్పుడు మాకు లంచ్ అవర్ ) అటువంటి సీరియల్స్ ఇప్పుడేవండి. ఈ మధ్య రాములమ్మ అని ఒకటి మొదలయ్యింది చిన్న పిల్లలకు కూడా ఆ జాడ్యం అంటిస్తున్నారు. సహజంగా ఉండే కొన్ని ఇంగ్లీష్ సిరీస్ చూస్తంటాను. అలాంటివి ఇక్కడెందుకు తియ్యరు అని ఆలోచిస్తాను దానికి సమాధానం ఈ మధ్య దొరికింది. అనిల్ కపూర్ పాపం ఇంగ్లీష్ లో హిట్ అయిన 24 అని ఒక సీరియల్ ని హిందీలో తీసాడు. దాన్ని చూసే వాడే కరువయ్యారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అందరికీ కాలక్షేపం సరుకు కావాలి కానీ విషయమున్నవి అవసరం లేనట్లుందండి.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.