23, జులై 2014, బుధవారం

కొంచెం నా సంగతి.


నేను మేథావిని కానే కాను కాబట్టి ఖచ్చితంగా బ్రతికిపోయాను
లేకుంటే ఏదో జెండానో ఎజెండానో మోస్తూ వ్యాసాలు వ్రాసే దుర్గతి పట్టేదేమో!

నేను గొప్పవాణ్ణి కాకపోబట్టి అదృష్టవంతుణ్ణని అర్థమైపోయింది
లేకుంటే ఎవరు నా బొమ్మ పెట్టేవారో ఎవరు దాన్ని కూలగొట్టేవారో!

నేను వారసులకు నోచుకోకపోవటమూ ఒక వరమే అయ్యింది
లేకుంటే వచ్చే తరాల్లో ఎవరెవరు నన్నెన్ని మాటలనే పరిస్థితి వచ్చేదో!

నేను రాముణ్ణి నమ్ముకోవటం అనేది నాపురాకృతసుకృతఫల మయ్యింది
లేకుంటే ఈ భవసాగరతరంగాల ఆటుపోట్లను ఎలా తట్టుకో గలిగే వాడిని?



టాం‍క్‍బండ్ మీద ఉన్న పెద్దల విగ్రహాలలో పనికిమాలిన విగ్రహాలున్నాయా?


స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి సారథ్యంలో హైదరాబాదులోని టాంక్‍బండ్ మీద ఏర్పాటు చేయబడిన తెలుగునాట  ప్రసిథ్థులైన వారి విగ్రహాల పట్టిక ఈ దిగువన ఇస్తున్నాను. ఇవి మొత్తం 33 విగ్రహాలు.

వీటిలో పనికిమాలిన విగ్రహాలున్నాయేమో కాస్త పరిశీలించండి.

     1     రాణీ రుద్రమదేవి 
     2     మెహబూబ్ ఆలీ ఖాన్ 
     3     శ్రీ సర్వేపల్లి రాదాకృష్ణ
     4     కట్టమంఇ రామలింగారెడ్డి
     5     గురజాడ వెంకట అప్పారావు పంతులు
     6     బళ్ళారి రాఘవ 
     7     అల్లూరి సీతారామరాజు 
     8     సర్ ఆర్థర్ కాటన్
     9     త్రిపురనేని రామస్వామి చౌదరి 
   10     పింగళి వెంకయ్య
   11     కందుకూరి వీరేశలింగ పంతులు
   12     మగ్ధుం మొహియుద్దీన్ 
   13     సురవరం ప్రతాపరెడ్డి 
   14     గుర్రం జాషువా
   15     ముట్నూరి క్ర్శష్ణారావు 
   16     శ్రీశ్రీ 
   17     రఘుపతి వెంకట రత్నం నాయుడు 
   18     త్యాగరాజస్వామి
   19     రామదాసు 
   20     శ్రీకృష్ణదేవరాయలు
   21     క్షేత్రయ్య 
   22     పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
   23     బ్రహ్మనాయుడు
   24     ఆతుకూరి మొల్ల 
   25     అబుల్ హసన్ తానాషా 
   26     సిధ్దేంద్రయోగి
   27     యోగి వేమన 
   28     పోతనామాత్యుడు
   29     అన్నమాచార్య 
   30     యర్రాప్రగ్గడ 
   31     తిక్కన సోమయాజి 
   32     నన్నయ భట్టారకుడు
   33     శాలివాహనుడు