24, జులై 2025, గురువారం

చక్కని వాడు

చక్కని వాడు రామచంద్రుడు వాడు
దిక్కు లన్నిటను పేరు కెక్కిన వాడు

మునివరులకు ముద్దు వచ్చు మోహనాంగుడు వాడు

జనకునకు ముద్దు వచ్చు వినయశీలి

జనుల కతడు మెచ్చుగొలుపు సద్గుణశాలి వాడు

జనకసుతకు ముద్దు వచ్చు శ్యామలాంగుడు


చక్కదనమునకే నిర్వచనమన నొప్పు వాడు

చక్కనైన విక్రమాతిశయము వాడు

చక్కగ భక్తులకు మోక్షంబు నిచ్చెడు వాడు

దిక్కై దీనులకు నిలుచు దేవదేవుడు