తప్పు లెన్న వచ్చితే దశరదతనయా నీ
తప్పే లేదనుచు చెప్పతరము కాదయా
నన్ను పోరా భూమికని యన్నది నీవు
నిన్ను విడువ కుందునని యన్నది నీవు
తిన్నగా నిపుడు పలుకకున్నది నీవు
యన్నన్నా నాతప్పు లెన్నవచ్చునా
నిన్ను నమ్ముకొనిన చాలునన్నది నీవు
నన్ను నీదు యంశనని యన్నది నీవు
ఎన్నడును కానరాక యున్నది నీవు
తిన్నగా నాతప్పు లెన్నవచ్చునా
నన్ను గావ రాముడవై యున్నది నీవు
ఖిన్నుడైన జీవుడనై యున్నది నేను
నన్ను బ్రోవ మనసురాక యున్నది నీవు
మన్నించుము నాతప్పు లెన్నవచ్చునా