రామనామము చేయరా
రామనామము చేయరా
రామనామము చేసి పొంద
రాని దేమీ లేదురా
రామనామమె వీలురా
రామనామమె మేలురా
రామనామమె చాలురా
రామనామము చేయరా
రామనామమె సులభము
రామనామమె సుఖదము
రామనామమె ఫలదము
రామనామము చేయరా
రామనామమె సురనుతం
రామనామమె శివనుతం
రామనామమె జననుతం
రామనామము చేయరా
రామనామమె శ్రీకరం
రామనామమె శుభకరం
రామనామమె భవహరం
రామనామము చేయరా
రామనామమె కామదం
రామనామమె జ్ఞానదం
రామనామమె మోక్షదం
రామనామము చేయరా