రామ రామ కలికాలము ఈరాకాసులటనే నాయకులు
భూమి మీద వీరి పిచ్చిమాటలు ముదిపోయె చూడు
భూమి మీద వీరి పిచ్చిమాటలు ముదిపోయె చూడు
కూడుపెట్టదు రామనామమని కూసేవా డొకనాయకుడు
కూడు వాడికి వేరుదైవమే కొలిచి యిచ్చునేమో
వాడికి యికపై కూడుపెట్టక వేడుక చూడుము రామయ్యా
కూడు లేక వా డలమటించితే కొంపమునిగి పోదు
కూడు వాడికి వేరుదైవమే కొలిచి యిచ్చునేమో
వాడికి యికపై కూడుపెట్టక వేడుక చూడుము రామయ్యా
కూడు లేక వా డలమటించితే కొంపమునిగి పోదు
కొలువునీయదు రామనామమని కూసేవా డొకనాయకుడు
కొలువులు వాడికి వేరుదైవమే పిలిచి యిచ్చునేమో
తలపకు యికపై వాడికి కొలువులు దయచేయుటను రామయ్యా
కొలువు లేక వా డల్లల్లాడిన కొంపమునిగి పోదు
కొలువులు వాడికి వేరుదైవమే పిలిచి యిచ్చునేమో
తలపకు యికపై వాడికి కొలువులు దయచేయుటను రామయ్యా
కొలువు లేక వా డల్లల్లాడిన కొంపమునిగి పోదు
గుణము లేనిది రామనామమని కూసేవా డొకనాయకుడు
గుణములు వాడివి బయటపడ్డవి గొప్పగ నీనాడు
అణకువ లేని వీడి మంచినే ఆలోచించకు రామయ్యా
గుణహీనుడు నాయకుడు పోయిన కొంపమునిగి పోదు
గుణములు వాడివి బయటపడ్డవి గొప్పగ నీనాడు
అణకువ లేని వీడి మంచినే ఆలోచించకు రామయ్యా
గుణహీనుడు నాయకుడు పోయిన కొంపమునిగి పోదు