హరియై కరుణించునా హరుడై కరుణించునా
హరియు హరుడు వేరనియెడు నరుని పరమాత్ముడు
హరుని గొలిచి హరిని విడువ హరుడు పెడమొగమిడు
హరిని గొలిచి హరుని విడువ హరియు పెడమొగమిడు
హరిహరాద్వైతంబును నరుడు భావించడో
హరితతత్త్వము లోనెరుగడు హరతత్త్వము నెరుగడు
హరి లింగప్రతిష్ఠ చేసె నరుడై శ్రీరాముడై
హరి పెద్ద తపంబు సేసె హరునకై కృష్ణుడై
హరుడు రామనామంబును ధ్యానించు నెప్పుడును
హరికి వేసిన దామంబును నరుడు శివుని మెడ గనె
హరిసహస్రనామంబులు హరునకును వర్తించును
హరుడు గొప్పా హరి గొప్పా యనువా డవివేకియె
హరి యనబడు హరు డనబడు పరమాత్ము డొకడను
నరుడు తెలియు నందాకను తిరుగు భవచక్రమున