హరి హరి శ్రీరామ నీయద్భుతకృపచే
నరులము సంతోషముగ ధర నుంటిమి
గిరిశృంగపు టౌన్నత్యము హరి నీకృపయే
తరువుకు గల గాంభీర్యము హరి నీకృపయే
తరువు నరుని బంధువగుట హరి నీకృపయే
నరునకు గల సత్వమెల్ల హరి నీకృపయే
విరులతీవ విరబూయుట హరి నీకృపయే
విరిరేకుల సౌందర్యము హరి నీకృపయే
విరుల పరీమళములును హరి నీకృపయే
పరిమళముల వలని హాయి హరి నీకృపయే
విరుల పలుకరించు గాలి హరి నీకృపయే
తరుణమెరిగి వచ్చు తుమ్మెద హరి నీకృపయే
విరులు స్వాదుఫలము లగుట హరి నీకృపయే
నరుల కవి హితవగుటయు హరి నీకృపయే