రఘుపతినే గా కింకొక్కని సంరక్షకు డనుకొను వాడా
అఘమోచనుడా హరి యొకడే నీవది యే మెఱుగవు పొరా
సనాతనుడు హరి సర్వేశుడు హరి సర్వజ్ఞుడు శ్రీహరిరా
అనాథరక్షకు డతడే రాముడు వినరా యిది సత్యమురా
వెఱ్ఱిమొఱ్ఱి దుర్మతముల బోధలు విని చెడిపోతివి గదరా
బుఱ్ఱలోని దుర్విష మడచినచో పుట్టునురా హరి భక్తి
హరేరామ యని హరేకృష్ణ యని యనుటే చాలును గదరా
మరింక ధరపై జనించి యిడుములు భరించు టుండదు కదరా