(ప్రమాణికా వృత్తాలు)
బిరాన నన్ను బ్రోవరా
ఖరాదిరాక్షసాంతకా
సురేశ్వరాభినందితా
నరేశ రామ రాఘవా 1
దినాధినాథవంశజా
మునీంద్రయాగరక్షకా
సనాతనా జనార్దనా
అనాథనాథ రాఘవా 2
హరీశరాజ్యదాయకా
సురారికోటినాశకా
సురేశహర్షదాయకా
నరేశ రామ రాఘవా 3
గిరీశజేశ ప్రస్తుతా
నరేశలోక సన్నుతా
పరంతపా నిరంజనా
ధరాత్మజేశ రాఘవా 4
సమస్తదుష్టనాశకా
సమస్తశిష్టరక్షకా
సమస్తభక్తపోషకా
నమస్కరింతు రాఘవా 5
సమస్తదుఃఖనాశకా
సమస్తసౌఖ్యదాయకా
సమస్తలోకపాలకా
నమస్కరింతు రాఘవా 6
దినేశవంశభూషణా
దినేశచంద్రలోచనా
అనింద్యదివ్యవిక్రమా
అనాథనాథ రాఘవా 7
స్మరింతు నీదు నామమే
నిరంతరంబుగా ప్రభూ
బిరాన నన్ను బ్రోవరా
నరేశ రామ రాఘవా 8
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.