నే నెవడ నయా నీ తప్పు లెన్నగ
కానీ నన్నిటు చేయుట కాదా నీ తప్పు
పొరబాటున పుడమికి పోవ నొప్పి కొంటినిబో
అరమరికలు లేక నీ వన్నియు బోధించ వలదె
ధరను చేరి చేరగనే తగులుకొనే అహమికను
మరి నీవు చెప్పలేదు మాట వరస కైన రామ
బలహీన మైన మనసు పాదు కొలిపి దాని కేమొ
బలమైన యింద్రియముల బలగ మిచ్చినావు కదా
బలిమి మీఱ యొడయుని బంధించదె బలగమును
తెలిసి తెలిసి చేసితివని తెలియ నైతి నయ్య రామ
పూని యెడము చేసితివని నేను నిన్ననును కాని
యేనాడును లేని గొప్ప యెడబాటే కలిగినది
పోనీ నీ వైన తెలిసి పోవలదని చెప్పవుగా
మానక దెప్పెదవు నిన్ను మరచి తిరిగి నానొ రామ
ఎన్నెన్నో తనువులెత్తి యెన్ని పాట్లు పడితి నయ్య
తిన్నగ నా తొంటి తీరు తెలిసి వచ్చె నేటికి
అన్నన్నా దోస మెవరి దైన నేమి యిన్నాళ్ళకు
మున్నెట్లో యటులె మనము ముదమున కలిసితిమి రామ
12, అక్టోబర్ 2012, శుక్రవారం
1 కామెంట్:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
>>కానీ నన్నిటు చేయుట కాదా నీ తప్పు
రిప్లయితొలగించండికాదు, కాదు, తప్పు కానేరదు ఎన్నటికీ...
>> మరి నీవు చెప్పలేదు మాట వరస కైనను
చెప్పవలదు, చెప్పవలదు, చెప్పిననూ తెలియవలదు
>> తెలిసి తెలిసి చేసితివని తెలియ లేనైతినిరా
తెలియవలదు, తెలియవలదు, పరమగురుడి తెలివి తెలియవలదు
>> మానక దెప్పెదవు నిన్ను మరచి తిరిగి నానని
తిరుగుబోతు తిరగబోతు తిరిగిబోతు, మరపు మాట తప్పు తప్పు
>> మున్నున్న విధమున మురియుచు నిను కలిసితి
మురిపెము తిరిపెము కలిసిన ఆనందము, ఆనందమే ఆనందము