"రాధేయుడు అంటే కర్ణుడు కదా
ఇక్కడ గుడిలో ప్రవచనాలు చెబుతుంది ఒకావిడ.కృష్ణుడు అంటోంది.నిజమేనా"
పైన ఉన్నది వాట్సాప్‌లో మాచెల్లెలు అరుణ పంపిన ప్రశ్న.
మా చెల్లెలికి నేను చెప్పిన మాటలు
"పరమశుంఠలు సభాపూజ్యులైరి ఒక శతకకారుడు అన్నాడు. దాని అర్ధం ఇదే. కుంతి కొడుకు కర్ణుడిని అతిరథుడు అనే సూతుడు గంగలో దొరికితే తీసుకొని వెళ్ళి తనభార్య ఐన రాధ చేతికి ఇచ్చాడు. అలా కర్ణుడు రాధేయుడు అంటే రాధకొడుకు అయ్యాడు. ఈసంగతి మనదేశంలో అందరికీ తెలుసును. ఇదిగో కొత్తకొత్త గురువులు వస్తున్నారు. జాగ్రత జాగ్రత అని పిల్లలకి చెప్పాలి మర్చిపోకు."
ఇంత చక్కని గురువును జనానికి పరిచయం చేయకపోతే ఎలా అని అనిపించి ఈముక్కలు బ్లాగులో వ్రాస్తున్నాను.
ప్రజలారా తస్మాత్ జాగ్రత. కొత్త గురువుల నుండి పిల్లలను కాపాడుకోండి!