24, సెప్టెంబర్ 2019, మంగళవారం
రవ్వంతయు చింత కలదె రాము డుండగ
రవ్వంతయు చింత కలదె రాము డుండగ
నవ్వుచు నాతండ్రి నన్నేలు చుండగ
ఇవలనవల నావా డినకులేశు డుండ
భవతారకము వాని భజనయు నాకుండ
పవలురేలు నాతని వాడనై యుండగ
నెవరెవరి దయయైన నేల నాకు రాముడుండ
ఇదికోరి యదికోరి నిటునటు తిరిగువారి
కుదితమై యుండుగా కుర్వి నెన్నొ చింతలు
నెదలోన నే చింత కదలాడును జనులార
వదలక నేనాడును మదిని నా రాముడుండ
కలుగునో కలగవో కలుములవి నాకేమి
తొలగునో తొలగవో దురితములు నాకేమి
నిలుచునో నిలువవో నేలపై నాపేరు
కలగ నాకేమిటికి కలనైన రాముడుండ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)