తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా మోసం చేయని కేంద్రప్రభుత్వమున్నదా? మోసపోయినా నోరు మూసుకొనే రకాలనే మోసగించి మోసగించి మురిసే నాయకులనే మరలమరల బుధ్ధిలేక మనం ఎన్నకుంటున్నాం భాధ్యతగా మోసపోయి బాధలే పడుతున్నాం ॥ తెలుగువాడు॥ ఆరుదశాబ్దులపాటు అంతులేని కష్టాలు అభివృధ్ధిని కాంక్షిస్తే అడుగడుగున నష్టాలు ఎన్నుకున్న నాయకులు మిన్నకున్న తన్నక మోసమని మొత్తుకునే మెతకతనం చాలిక ॥తెలుగువాడు॥ కలసి ఉన్నప్పుడే కడగండ్లకు లోటులేదు ముక్కచెక్కలయ్యాక ముఖంచూచే దెవ్వరు ఆలనపాలన లేని ఆట్టడుగు ఆంద్రజనం అంతులేని బాధలతో అఘోరించు దినం దినం ॥తెలుగువాడు॥ |
||
గమనిక: 2, మార్చి 2015, సోమవారం, 3:10PM సమయంలో పై గేయాన్ని ఒక బ్లాగులో వ్యాఖ్యగా వ్రాసాను. శ్యామలీయం బ్లాగులో ఉంచటం బాగుంటుందని ఇక్కడ కూడా అదే రోజున 3:22PM సమయంలో ప్రచురించాను. ఈరోజు 26/3/19న 7:00PM సమయంలో మరలా ప్రచురిస్తున్నాను.