హరిమీద గిరియుండె గిరిమీద హరియుండె హరిగిరు లిటు లుండ గిరి గిరగిర తిరిగె |
|
సురలసురులు నా వాసుకి కవ్వపు త్రాడుగ గిరిమంధరము క్షీరశరధిని కవ్వముగ తరచువేళ గిరి మునిగెడి దైన బొబ్బలిడగ నిరుపమానమైన మహిమ నిండారగ నిటుల |
హరి |
కడు కఠినమైన చిప్ప కల కూర్మం బగుచు నడగడిగో కొండ క్రింద నవతరించినాడు వడి తిరిగెడు గిరియొరుగక పట్టి నిలుపు చుండ నిడిగిడిగో కొండమీద నిదే నిలచినాడు |
హరి |
నాడు శ్రీకూర్మ మగుచు నడిపి నాటకమును వాడే శ్రీరాము డగుచు వసుధ నేలి నాడు వాడే భవవార్నిధిని వేడుకతో జొచ్చి వాడుక నందరను కాచు పైన క్రింద నుండి |
హరి |
9, అక్టోబర్ 2016, ఆదివారం
హరిమీద గిరి యుండె
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)