మాయ నన్ను కప్పెనా మంచిదే కదా మాయ నన్ను విడచెనా మంచిదే కదా |
|||
మాయావరణంబు గలిగి మసలుచు నేనుండగా మాయదారి మనుషులు నా మార్గమెఱుగ జాలరుగా హాయిగా నిన్ను నే ధ్యానించుకొందునురా ఓ యీశ్వర యంతకన్న నున్నదా సదుపాయము |
మాయ | ||
నీకు నాకు మధ్య మాయ లేకు మంచిదె రామ ఏకమై యుండెద మది యెంతమంచిదో రామ నీకిది సమ్మతమే నని నే నెఱుంగుదును రామ నాకిది యానందమని నీకు మున్నె తెలియును రామ |
మాయ | ||
ఎవడ వీవు యేది మాయ యేది మంచి యేది చెడుగో యెవడ నేను యెవ్వ రొరులు హెచ్చు తగ్గు లెటుల గలుగే నివల నవల నున్నవాడ వెంచ నన్నియును నీవ భవుడ వభవుడవు నీవ పరమసత్యమవు నీవ |
మాయ | ||
20, ఏప్రిల్ 2016, బుధవారం
మాయ నన్ను కప్పెనా మంచిదే కదా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)