నీ మాట విందునని నా మాట విందువా నీ మాటనే సతము నెగ్గించుకొందువా |
|||
తోలుతిత్తులలోన త్రోయుట మానుమని వేలమారులు నిన్ను వేడితే వింటివా నేల మీద నేను నిలబడి యాడితే చాలు వేడుక నీకు సంకటము నాకు |
నీ మాట | ||
కామాదులకు చిక్కి కటకట బడనీక ప్రేమతో బ్రోవుమని వేడితే విందువా ఏమోమొ చెప్పేవు యేమార్చి పంపేవు నీ మాయ నీశ్వరా నామీద జూపేవు |
నీ మాట | ||
ఇర్వుర మొక్కటా యిడుము లన్నియు నాకా యుర్విపై నాయాట లున్నది నీ కొఱకా సర్వేశ్వరా యింక చాలునంటే వినవు పూర్వస్థితిని పొంద బుధ్ధాయె రామ |
నీ మాట | ||
13, ఏప్రిల్ 2016, బుధవారం
నీ మాట విందునని నా మాట విందువా?
లేబుళ్లు:
ఆధ్యాత్మ కవితలు - కీర్తనలు,
రామకీర్తనలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)