సుకాంతి. తరింప జే యరా పరా త్పరా బిరా న రాఘవా |
ఈ సుకాంతి వృత్తానికి గణవిభన జ - గ. అంటే నాలుగే నాలుగక్షరాలు పాదాని కన్నమాట. ఈ వృత్తాన్నే నాగవర్మ జనోదయం అన్నాడు. దీనికే కళా అని పేరు కూడా ఉంది. యతిస్థానం అంటూ లేదు కాని ఎంత చిన్న వృత్తానికైనా (శ్రీవృత్తం తప్ప) ప్రాసనియమం తప్పదు కదా.
ఈ వృత్తానికి గురులఘుక్రమం IUI U దీనినే మనం IU IU అనీ చూడవచ్చును. అంటే పాదానికి రెండు ఎదురు నడకతో ఉండే వ-గణాలు.
విశ్వనాథవారు ఈ వృత్తాన్ని వాడుక చేసినట్లు తెలుస్తున్నది. ఎవరికైనా ఉదాహరణ లభ్యంగా ఉంటే దయచేసి పంపగలరు. ఇతర పూర్వకవులెవరన్నా సుకాంతి వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.