ప్రమాణి. ధరాత్మజామనోహరా మొరాలకింప వేమిరా పరాకు మాని ప్రోవరా తరింపజేయరా ప్రభూ |
ప్రమాణి
ఈప్రమాణి వృత్తానికి గణవిభజన జ - ర - లగ. అంటే పదానికి 8 అక్షరాలు మాత్రమే కల చిట్టి వృత్తం
రెండు ప్రమాణిపాదాలు కలిపితే అది పంచచామరం అవుతుంది.
నడక చూస్తే ఈప్రమాణి వృత్తం నడిమికి విరుగుతూ జగ - జగ అన్నట్లుగా ఉంటుంది. లేదా అక్కడక్కడ ఇది జ - గల - ర అన్నట్లుగా ఉంటుంది. ఎదురు నడకతో ప్రారంభం కావటమే ఈ వృత్తాల్లోని ప్రత్యేకమైన అందానికి కారణం అనుకుంటాను.
ధరాత్మజా - మనోహరా
తరింప - జేయ - రా ప్రభూ
నిరంతరం - భజింతురా
పరాకు - మాని - బ్రోవరా
తరింప - జేయ - రా ప్రభూ
నిరంతరం - భజింతురా
పరాకు - మాని - బ్రోవరా
తెలుగులో పూర్వప్రయోగాలు ఎక్కువగా ఉన్నట్లు తోచదు. అధునిక ప్రయోగం కావ్యకంఠ గణపతి ముని గారు చేసిన ఆథ్మాత్మిక సర్వోపచార పూజ ఒకటి చక్కటిది ఉన్నది. తప్పక చదవదగినది.
ఇంకొకటి గుండు మధుసూదన్ గారి శ్లోకం చూడండి.
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద!
స ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్
ఇంకొకటి గుండు మధుసూదన్ గారి శ్లోకం చూడండి.
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద!
స ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్