లలిత. శ్రీరామచంద్రునకు చిత్త మంకితం శ్రీరామనామమున జిహ్వ పావనం శ్రీరామ చింతనము క్షేమదం శుభం శ్రీరామచంద్రునకు సేవ మోక్షదం |
ఈ లలిత వృత్తం కూడా పొట్టి వృత్తమే. పాదానికి నాలుగు గణాలు త - భ - జ - ర అనేవి. యతిస్థానం 8వ అక్షరం. ప్రాసనియమం ఉంది వృత్తం కాబట్టి.
ఈ పద్యలక్షణం లక్షణసారసంగ్రహం అనే గ్రంథంలో చెప్పబడింది.
ఇంతకు ముందు ఈలలిత వృత్త ఛందస్సులో కవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.
నాకు అనుపించిన ఈ లలిత వృత్తపు నడక ఇలా ఉంది:
శ్రీరామ - చంద్రునకు - చిత్త మంకితం
శ్రీరామ - నామమున - జిహ్వ పావనం
శ్రీరామ - చింతనము - క్షేమదం శుభం
శ్రీరామ - చంద్రునకు - సేవ మోక్షదం
ఇటువంటి చిన్నిచిన్న వృత్తాలు మీరు కూడా ప్రయత్నించండి. బాగుంటాయి.