మున్నుడి: నిన్న నేను చేసిన వ్యాఖ్య ఒకటి అచ్చు కెక్క లేదు. పోనీయండి, నేనే అచ్చేసికుంటున్నాను!
>ఇది విన్నాక తెలుగువాడిగా పుట్టడం ఓ అదృష్టం అనిపించింది
వ. మంచిది.
మ. మనుజుల్ గీచిన గీత కావలను సన్మానంబుతో నుండుచో
మనముల్ సంతస మేర్పడంగ నెగురన్ మా గొప్ప నదృష్టమే
యన వచ్చుం గద చూడగా నదియు నూహాతీతమై యొప్పు నా
ఘన కాల ప్రతిపాద్య సౌఖ్యమగుచున్ కన్పించుచుండెం గదా
మ. మనుజుల్ గీచిన గీత కీవలగ నే మాత్రంపు తేజంబు లే
కను దుఃఖంబున నీరసించి వగవంగన్ వచ్చు నా దైన్య మే
మని వర్ణింపగలారమయ్య యది యూహాతీతమై యొప్పు నా
ఘన కాల ప్రతిపాద్య కష్టమగుచున్ కన్పించుచుండెం గదా
కం. ఆవల నదృష్ట మున్నది
ఈవల ఘన దుఃఖ మున్న దీ రెండును కా
లావధి చే నేర్పడినవి
యే వేళకు నెట్లు మారు నెవ్వరి కెఱుకౌ.
వ. కాబట్టి ప్రాజ్ఞులు రెంటిండి యందును సమబుధ్ధి కలిగియుందురు.

ఈ వ్యాఖ్య తిరస్కరణకు గురైనదో లేదా సదరు బ్లాగువారు ఇంకా పరిశీలించలేదో తెలియదు. ఈ పద్యాలు కాసినీ జనం చదివినంతమాత్రాన కొంప మునిగేదేమీ లేదనిపించి ప్రచురిస్తున్నాను.