నిశ్శబ్దంగా వస్తారంతా నిశ్శబ్దంగా వెళ్తారంతా కొందరు మధ్యలో గుబాళిస్తారు కొంద రందులో మన నేస్తాలు అందరూ లోకాన్ని చూస్తారు కొందరే లోతుగా చూస్తారు కొందరు మనకూ చూపిస్తారు అందుకే వారు మన నేస్తాలు మౌనంగా చూసేవాడు ముని మనకు చూపించే వాడు కవి ముని తనలో తాను జీవిస్తాడు కవి మన కోసం జీవిస్తాడు మనం కవిజీవుల్ని పట్టించుకోం మనం మనసంగతే పట్టించుకోం జనం ఇంతే అనుకుంటూనే కవి మనం బాగుండాలని రాస్తాడు కవి పరితాపాన్ని తెలుసుకోం కవిని ఋషియని తెలుసుకోం కవివిలువని మనం తెలుసుకోం కవిని స్నేహితుడని తెలుసుకోం కవి శరీరాన్ని కాలం మింగుతుంది కవిత్వాన్ని జననిర్లక్ష్యం మింగుతుంది కవిని మరిస్తే ఏం జరుగుతుంది జాతి భవితనీ కాలం మింగుతుంది |
||
10, మార్చి 2015, మంగళవారం
కవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)