కం. శ్రీరామా యిది మేలా యీ రీతిని ముక్కలైన యీ గడ్డకు రే పే రోజున యే కష్టము లే రానుండినవి తండ్రి ఇకపై తఱచై ఆ.వె. కలసి యుండలేక కలహించుకొని మేము వేరుపడితి మయ్య విశ్వనాథ ఇల్లు ముక్కలైన తల్లి యేడ్చును గాని ఎదుటి ఇంటి వార లేడ్వరుగద తే. అయ్యవారి నట్టిల్లను నట్టు లున్న దివల సీమాంధ్ర భాగమే యెంచి చూడ అల తెలంగాణ భాగమందన్న విజయ మట్టు లుండగ చిక్కులతుట్ట లుండె ఆ.వె. తెలుగువాడి నన్న దేశంబు నవ్వగా శిరము వంచుకొనెడు స్థితికి నేడు చేరుకొంటి మయ్య యేరీతి నిక ముందు జరుగ గలదొ శుభము సారసాక్ష కం. కాలము చేసిన దానిని మేలని కీడనుచు నెంచి మేమతి భ్రాంతిన్ దూలిద మిది యెల్లను నీ లీలయె యను నట్టి యెఱుక లేక మహాత్మా |
[ నా శ్యామలీయం బ్లాగులో 500వ టపా ఇలా వ్రాయవలసి వస్తుందని అనుకోలేదు.]