అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!
| ప్రత్యేకంగా యుధ్ధవిమానం మోసుకు వచ్చెను విభజన బిల్లు శ్రధ్ధగ చదివిన పిమ్మట చర్చకు దిగవలె తొందరపడరాదండీ | |
కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!
| చర్చకు తగిన సమయం బిచ్చుట సంప్రదాయమని మరువరాదయా ఎప్పటిలాగే ఆరువారముల గడువు నిచ్చిరని గమనించుడయా | |
అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?
| లాబీయింగులు సీమాంధ్రులకే కలిసొస్తే యీ బిల్లొచ్చేనా లేనిపోని యారోపణలెందుకు చీటికిమాటికి చిందులెందుకు | |
కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!
| కేంద్రము చేసిన దుష్కార్యములే కాంగ్రెసు నిప్పుడు కాటికి పంపును కాలము చెప్పును కలసి వచ్చునది తెలంగాణకో సీమాంధ్రముకో | |
త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా
| ఎందుకు లెండి హడావుడి పడటం కేంద్రం కరుణకు గడబిడపడటం మహత్కార్యమో దుష్కార్యమ్మో సమయం తీసుకు చర్చించవలె | |
కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!
| కొత్తగడువులను పెట్టేటందుకు మీరెవరయ్యా తప్పుగదయ్యా మీ దూషణలకు చింతించరయా మీ మెప్పులతో పనిలేదయ్యా |
(ఇది శ్రీగుండువారి సాగదీత...కుట్రేనా? అనే టపాకు స్పందన)