ఈ నెల 5 వ తారీఖు గురువారం.
నాటి రాత్రి ఇంచుమించు పదకొండున్నర సమయంలో ఆ రోజుకు వీడ్కోలు పలికి పడక మంచం మీదకు చేరటం జరిగింది.
రోజూ శయనించే ముందు కొంతసేపు రాములవారిని ధ్యానం చేసుకోవటం అలవాటు.
ఏ రోజున ఎంత సేపు అలా ధ్యానం కొనసాగుతుందీ అన్నది నా చేతిలో లేదు.
ఒక్కొక్క రోజున ఒక గంట సేపు నడుస్తుంది ధ్యానం.
అప్పుడప్పుడు రాత్రంతా కొనసాగటమూ జరుగుతుంది.
ఆ రోజు రాత్రికూడా యథావిధిగానే ధ్యానం చేసుకుంటున్నాను.
చాలా సేపే కొనసాగింది ఆ ధ్యానం.
ఉన్నట్లుండి ఒక్కసారిగా ఒక కుదుపు లాగా వచ్చింది.
ఆ వెంటనే ఎందుకో తెలియని ఆవేశం కలిగింది.
అది కోపం కావటానికి వీలు లేదు.
కోపానికి ఆధారంగా ఏదన్నా విషయం ఉండాలి కద.
ఆవేశం రాగానే కొంచెం భయం వేసిన మాట వాస్తవం.
ఇంత ఆవేశం ఎందుకో తెలియక పోవటమే భయహేతువు కావచ్చు.
ఒక పక్క ధ్యానం కొనసాగుతూనే ఉంది.
ఆవేశం తీవ్రతా హఠాత్తుగా పెరిగి పోయింది.
ఒళ్ళంతా బహులఘువుగా ఐపోయింది.
గాలిలో తేలుతున్న ఈకలాగా శరీరం కంపించటం స్పష్టంగా అవగాహనకు వచ్చింది.
ఉద్రేకం పట్టలేక నోటినుండి కేకలు బయటికి వచ్చాయి.
కొద్ది నిముషాలు కొనసాగిందీ స్థితి.
క్రమంగా శరీరం యథాస్థితికి వచ్చిందా లఘుత్వం నుండి.
ఆవేశమూ అలాగే క్రమంగా తగ్గి ప్రశాంతమైన మనఃస్థితి కలిగింది.
ఒక గొప్ప తుఫాను వెలసినట్లయింది!
మెల్లగా ఈ ప్రశాంతత కారణంగా కాబోలు ఆనందం కలిగింది.
అపరిమితమైన ఆనందం అది.
ఈ విచిత్రానుభవం కలుగుతున్నంత సేపూ ధ్యానానికి ఏమాత్రం ఆటంకం కలగక పోవటం విచిత్రం.
ఆ స్థితి చాలా సేపు కొనసాగింది.
మెల్లమెల్లగా సాధారణమైన పరిస్థితికి మనస్సు వచ్చింది.
పూర్తిగా ఈ అనుభవం నుండి తేరుకున్నాక, ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.
ప్రక్కదిగి లైట్ ఆన్ చేసాను.
గోడగడియారం వంక చూసాను. సమయం రాత్రి గం.1:45ని॥
మంచినీళ్ళు తాగి పడుకున్నాను.
ధ్యానం మరికొద్ది సేపు కొనసాగాక నిద్రపట్టింది.