శ్రీరామచంద్రదివ్యపాదపంకేరుహచింతనాతత్పరులైన భక్తమహాశయులారా!
ఈ రోజు నుంచి శ్రీరామచంద్రప్రభువులవారి మానసికపూజ కోసం పద్యాలు చెప్పుకుందాం .మన వాడుక ప్రకారం ఈ పద్యాల్ని రోజకు ఒకటి చొప్పున చదువుకుందాం. అందరూ గమనించ వలసిందిగా నా ప్రార్థన.
ఈ పద్యాలు సద్భక్తమహాశయు లందరికీ ఉపయోగంగా ఉండి నిత్యం సంతోషం కలిగిస్తాయని నా ఆశ. అన్ని పూజావిధానాల్లోనూ మానసిక పూజావిధానం సర్వశ్రేష్టం. మానసిక పూజకు భౌతికమైన ద్రవ్యాలతో నిమిత్తం లేదు. ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన నియమాలూ, ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన మంత్రతంత్రాల పరిజ్ఞానము, ఆ మంత్రాల అర్థాల యొక్క జ్ఞానం వంటివి ఏమీ అవసరం లేదు. అలాగని, సంప్రదాయికంగా మనం జరుపుకునే పూజావిధానాన్ని నిరసించటం, తిరస్కరించటం వంటివి చేయకూదదని గమనించండి. మానసిక పూజ అనేది ఒక విశేషమైన పూజావిధానం. అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండటం, అనుకూలంగా ఉండటం ఈ మానసిక పూజా విధానం ప్రత్యేకతలు.
పూజచేయటానికి సంకల్పించుకోవటంతో పూజను ఆరంభించటం జరుగుతుంది. అందుకే దీనికి సంకల్పం అని పేరు.
సంకల్పము
కం. మనసా నిన్నర్చించెద
తనివారగ నిపుడు జనకతనయానాథా
వినతాసుతఘనవాహన
మునిజననుత రామచంద్రమూర్తీ భక్తిన్
తాత్పర్యము: ఓ రామచంద్రమూర్తీ, జానకీపతీ, వినతాదేవి కుమారుడు గరుత్మంతుణ్ణి ఆదరంగా వాహనం చేసుకున్న వాడా (అనగా నీవే శ్రీమహావిష్ణువూ అని సంబోధిస్తున్నామన్న మాట), జ్ఞానులైన మునులచేత స్తుతించబడేవాడా, భక్తితో, ఇప్పుడు నిన్ను నా మనస్సులో తనివితీరేటట్లుగా అర్చిస్తున్నాను.
(జూలై 2013)