పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను
దిగలాగుచున్నదీ ప్రకృతిదేహబంధము వీడి దివ్యత్వమున నుండ
నూహ చేసెడివేళ సుడికించుచున్నది
ఐహికవాంఛల నిదే యెగదోయుచున్నది
స్నేహ హస్తము జాచి చేదుకో రామ
ఈ నశ్వరములపై పోని నా బుధ్ధికి
లేని యాశల నెల్ల తాను గ్రుచ్చేను
దాని దుందుడుకును పూని నీ వైనను
మానిపించుము నన్ను మన్నించి రామ
నీవు నే నొకటనే నిశ్చయంబున నుండ
కావు నా వాడవని గద్దించు చున్నది
ఏవిధి తొలగింతువో యిట్టి చీకాకును
కావ నీ వే దిక్కు కరుణించు రామ