నేనెరిగిన దెల్ల నీకొఱకై
మానక మరిమరి ధ్యానము చేయుట
నేనడిగిన దెల్ల నా కొఱకై
నీ నిజరూపము మరి మరి చూపుట
భ్రమలను విడచిన దేహిని గాను
శమదమంబుల విధులే నెరుగను
అమలిన సహజోదారప్రేమమున
నిముసము విడువక నిను భావింతును
లోకక్రియోపరి నిష్టుత దేనికి
నీకు మెప్పుగా నిలువగ లేనిది
నీకై మనసే ముడుపు గట్టితిని
నా కెరుకగు నటుగా కొలుతును
నను చేసినదీ నీవని యెరుగుదు
నను నడుపునదీ నీవని యెరుగుదు
ననునిను నొకటిగ నాత్మ నెరుగుదు
కనుకనె నిను చూడక నెటులుండుదు