29, మార్చి 2017, బుధవారం

ఉగాది


అరువది యైదు వచ్చిన వుగాదులు నే జనియించి నేటికిన్
వరుసగ వచ్చిపోయినవి వన్నెలపూల వసంతకాలముల్
చురచుర మండు నెండలును క్షోణితలంబును ముంచువానలున్
పరమమనోహరంబులన వచ్చు శరత్తులునుం సమస్తమున్

పరువము వచ్చి పోయెనది వచ్చుటయే గమనించనైతి నా
గరువము వచ్చి పోయెనది కాలప్రవాహము కొంచుపోవగన్
మరణము పల్కరించినది మానక మాటికి నీశ్వరాజ్ఞచే
మరలక దేహమందు తిరమైనవిధంబున నుంటి నేడిటుల్

వచ్చె వసంతకాలమని పండువ చేయగ నెల్లవారలున్
మెచ్చి కవీంద్రులందరును మేలిమికైతల గుప్పుచుండగన్
ముచ్చటగా నుగాది మన ముందుకు వచ్చెను కాని నేటికే
హెచ్చిన యెండవేడిమికి యెందును కోయిల కూతలుండెనే

ఐనను సంప్రదాయమని యందరు చేయు వసంతగానముల్
వీనుల విందుగా వినుచు వేడుక చేయుచు క్రొత్త యేట రా
నైన శుభాశుభాదికము లాత్రుతమీఱ విమర్శ చేయుచున్
నేనును హేమలంబికి ననేక ప్రణామము లాచరించెదన్
  

8 కామెంట్‌లు:

  1. రామాయణం గురించి ఓక సందేహం.సీత రాముది కన్నా పెద్దదా?కదహలో మోద్ట సీత పుట్టుకని గురించి చెప్పారా?రాముని పుట్టుకని గురించి చెప్పారా?

    ఎందుకంటే సీత రాముడి కన్న పెద్దది అని వాదించేవాళ్ళు ఒక కధ చెప్పాలనుకున్న రచయిత మోద్త జరిగినదాన్ని మొదట చెబుతాడు అనే వాదనతో సీతని గురించి మొదట చెప్పడం జరిగిందని అంటున్నారు.

    రాముడు విశ్వామిత్రుడి వెంట మిధిలకు వెళ్లడానికి చాలా ముందు గానే సీతకి పెళ్ళీడు రావటం,స్వయంవరం ప్రకటించహ్తం,రాజకుమారులు శివధనుస్సును ఎత్తలేకపోయినా యుద్ధాలు చెయ్యటం లాంటివి జరిగాయనేది కూడా ఒక వాదనగా వినిపిస్తున్నది.

    మీరయితే అసలు కావ్యం కూడా చదివిన వారు అగ్నక రెఫరెన్సులు కూడా ఇవ్వగలని అడ్గుతున్నాను.

    P.S:ఒక డౌటు అంటూ వస్తే అది తీరేవరకు నిదరపట్టదు గనక వీలున్నంత తొందరగా జవాబు చెప్పగలరు:-)

    రిప్లయితొలగించండి
  2. రామాయణకథలో ఎవరిని ముందు వాల్మీకి ప్రస్తావించారు? అయన కావ్యారంభసమయంలో నారదులవారిని ప్రశ్నిస్తే ఆయన రాముడి గురించి చెప్పటంతో కథ మొదలౌతుంది.

    అష్టావర్షాత్ భవేత్కన్యా అని అంటారు. రామాయణకాలంలో ఏమనేవారో పరిశీలించాలి. ఊనషోడశవర్షప్రాయుడని దశరథుడే రాముణ్ణి విశ్వామిత్రుడికి ఇచ్చేముందు అన్నమాట. స్వయంవరం అనవచ్చునా అన్న సందేహం అటుంచి రాముడు శివధనువుని ఎక్కిడినప్పుడు సీత సభలో లేదు - ఉన్నదని చెప్పేవి నాటకాలూ సినిమాలూ కొన్ని కవిత్వాలూ మాత్రమే. శివధనువును ఎత్తలేని రాజులు కోపించి జనకుడిపై దండెత్తిన మాటా, ఆయన దైవసహాయంతో వాళ్ళని తరిమెయ్యటమూ వాల్మీకి కథనంలో ఉన్నమాటలేను. రాముడు సీతకోసం శివధనువును ఎత్తలేదు - దాన్ని విరవాలని భావించనూ లేదు. జనకుడు పిల్లనిస్తానంటే మానాన్నగారిని అడగండి అన్నాడంతే కాని ఎగిరి గంతెయ్యలేదు.

    పరిశీలించి మీరడిగిన విషయంలో కొంత చెప్పటానికి యత్నిస్తాను. కాని తలమునకల పనిలో పడి కొట్టుకుంటున్నాను మరి. చూదాం ఎంతతొందరగా వీలయ్యేదీ.

    రిప్లయితొలగించండి
  3. కొన్ని సందేహాలు తీరాయి,సంతోషం!

    అవును,శ్రీరాముడు శివధనుస్సును ఎత్తినప్పుడు సీత అకక్ద లేదు!సీత కోసం యుద్ధాలు అజ్రగ్దమూ నాకు తెలుసు!విల్లు ఎత్తినది పెళ్ళి కోసం కాదనీ నాకు తెలుసు,బహుశా విశ్వామిత్రుల వారు ప్రయత్నించి చూదమంటే గురువాక్యం పాటించి ఉంటాడు - ఇది నాకు స్పష్తంగా తెలియదు.

    అన్ని వివరాలతో ఒక పోష్టు వేస్తానన్నారు,మరీ సంతోషం!మీకు తగినంత సమయం ఉన్నప్పుడే రాయండి,ఎవరు పెద్ద అన్నది తేల్చహ్తం మాత్రం మర్చిపోవద్దు.

    రిప్లయితొలగించండి
  4. కొన్ని సందేహాలు తీరాయి,సంతోషం!

    అవును,శ్రీరాముడు శివధనుస్సును ఎత్తినప్పుడు సీత అక్కడ లేదు!సీత కోసం యుద్ధాలు జరగటమూ నాకు తెలుసు!విల్లు ఎత్తినది పెళ్ళి కోసం కాదనీ నాకు తెలుసు,బహుశా విశ్వామిత్రుల వారు ప్రయత్నించి చూదమంటే గురువాక్యం పాటించి ఉంటాడు - ఇది నాకు స్పష్టంగా తెలియదు.

    అన్ని వివరాలతో ఒక పోష్టు వేస్తానన్నారు,మరీ సంతోషం!మీకు తగినంత సమయం ఉన్నప్పుడే రాయండి,ఎవరు పెద్ద అన్నది తేల్చటం మాత్రం మర్చిపోవద్దు.

    రిప్లయితొలగించండి
  5. మీ ఉగాది పద్య-చతుష్కం చాలా బావుంది. శుభకామనలు, శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇవి చదివి బాగున్నాయన్నవారు మీరొక్కరే. ధన్యవాదాలు.

      తొలగించండి
  6. శ్యామలీయం గారు, శ్రీరామ నవమి కి రాముడి పై మీరు రామకీర్తన వ్రాస్తారేమో అనుకున్నాను. టపా ఏమి వ్రాయలేదే ?

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.