ఏమిలాభము మన కది ఏమిలాభము శ్రీ
రామాంకితము కానిచో నేమిలాభము
ఎంతపొడవు నాలుకయుండి యేమిలాభము అది
సంతోషముగ రామనామజపము చేయక
ఎంతపొడవు నాలుకయుండి యేమిలాభము అది
సంతోషముగ రామనామజపము చేయక
ఎంతలేసి కన్నులుండియు నేమిలాభము అవి
సంతోషముగ రామచరణ సన్నిధి నుండక
ఎంతబారు కరములుండియు నేమిలాభము అవి
సంతోషముగ శ్రీరామున కర్చనలు చేయక
సంతోషముగ శ్రీరామున కర్చనలు చేయక
ఎంతపొడవు కాళ్ళుండినను యేమిలాభము అవి
సంతోషముగ రాముని గని సాగి మ్రొక్కక
సంతోషముగ రాముని గని సాగి మ్రొక్కక
ఎంతచదువు చదివిన గాని యేమిలాభము కడు
సంతోషముగ రామచంద్రుని స్తవముజేయక
సంతోషముగ రామచంద్రుని స్తవముజేయక
ఎంత పాండిత్యమును గడించి యేమిలాభము కడు
సంతోషముగ రామతత్త్వము చింతన చేయక
ఎంతగ పుణ్యమార్జించియును యేమిలాభము బహు
సంతోషముగ రామార్పణము సలుపక యుండిన
ఎంతచక్కని మనసుండినను యేమిలాభము అది
సంతోషముగ రాము నెపుడును చింతనచేయక
సంతోషముగ రాము నెపుడును చింతనచేయక
ఎంతటి సిరిసంపద లుండి యేమిలాభము కడు
సంతోషముగ రాముని సేవ కింతయు చెల్లక
సంతోషముగ రాముని సేవ కింతయు చెల్లక
ఎంతటి బంధు బలగముండియు నేమిలాభము కడు
సంతోషముగ రామునిపొగడు జనులై యుండక
ఎంతటి మిత్రమండలి యుండి యేమిలాభము కడు
సంతోషముగ రామభక్తజనులై యుండక
ఎంతటిబ్రతుకు బ్రతికినగాని యేమిలాభము కడు
సంతోషముగ రామబంటై చక్కగ బ్రతుకక