హరిభక్తులము హరిబంటులము హరియానతిపై తిరిగెదము
హరిగానమునే చేసెదము శ్రీహరిలీలలనే పాడెదము
హరిభక్తులతో తిరిగెదము శ్రీహరిక్షేత్రములే తిరిగెదము
హరినామములే పలికెదము శ్రీహరికీర్తనలే పాడెదము
హరిరూపమునే తలచెదము శ్రీహరితత్త్వమునే తలచెదము
హరిచరితమునే యెంచెదము శ్రీహరినే శరణము కోరెదము
హరినే యెప్పుడు నమ్మెదము శ్రీహరినే యెప్పుడు కొలిచెదము
హరికై యెప్పుడు పాడెదము హరికై యెప్పుడు నాడెదము
హరినే తప్పక వేడెదము శ్రీహరినే యొప్పుగ కూడెదము
హరినే యెల్లెడ జూచెదము శ్రీహరినే శరణము కోరెదము
హరేరామ యని పాడెదము హరేకృష్ణ యని పాడెదము
హరిగొప్పలనే పాడెదము హరిలీలలనే పాడెదము
హరితోకలసి యుండెదము హరిచెంగటనే నిలచెదము
హరికన్యము లేదనియెదము శ్రీహరినే శరణము కోరెదము