15, జులై 2020, బుధవారం
రావణుని పైకి పోవు రామబాణమా
రావణుని పైకి పోవు రామబాణమా వాని
కావరము నణచి హరి ఘనత చాటుమా
వాడు మూడు లోకాలు గెలిచిన వాడైతే నేమి
వాడు శివదేవుడు మెచ్చు నట్టి భక్తుడైతే నేమి
వాడు పది తలలను కలిగినట్టి వాడైతే నేమి
వాడు రామబాణమునకు నేడు పడక తీరునా
వాడు మునుల నెల్ల బాధించు వాడగుట వలన
వాడు వనితలను చెఱబట్టు వాడగుట వలన
వాడు సురల కెల్ల దుస్సహుడగు వాడగుట వలన
వాడు చేసిన తప్పులకు శిక్ష పడక తీరునా
వాడు తన కపజయమే లేదని భావించు వాడు
వాడు తన కెప్పుడు మృతి లేదని భావించు వాడు
వాడు హరి భక్తుల నెల్లప్పుడు బాధించు వాడు
వాడు నే డిపుడు నీ దెబ్బకు పడక తీరునా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)