9, జులై 2020, గురువారం

ఇదె వచ్చె నిదె వచ్చె నీ మాయజింక


ఇదె వచ్చె నిదె వచ్చె నీ మాయజింక
పదపద దాని వెంటబడ వలయు నింక

ఈ మాయలేడితో నిదే మొదలాయె
రామనాటకంబు నందు రావణవధాంకం
శ్రీమహిళామణి లంక చేరగ మొదలౌను
తామసుని పతనము త్వరపడవయ్య

దేవకార్యము దీర్చ దిగివచ్చినావు
దేవదేవుడ వీవు దివిజులందరును
నీవంక జూచుచు నిలచియున్నారు
లేవయ్య పోవయ్య లేడి వెంబడి

రావణుడై యున్నది నీవాకిట నే
కావలి యుండు జయుడు కాదటయ్యా
నీవానిపై కరుణ నిను నరునిగ జేసె
వేవేగ రమ్మనుచు పిలిచెరా వాడు