9, మార్చి 2018, శుక్రవారం
దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే
దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే
అమ్మలార రామునకు హారతు లీరే
నారాయణమూర్తి వీవె నరుడ వైనా వనుచు
పోరి రావణుని నీవు పొడిచేసి నా వనుచు
చేరి దేవతలు రేగి జెజేలు కొట్టి రట
వారి దిష్టి తగిలినేమొ వనజాక్షునకు
మూడులోకముల నున్న ముదితలందరకును
పీడయై నట్టి తులువ పాడు రావణాసురుని
వాడిబాణాల జంపి నాడని మురిసి పొగడు
చేడియల దిష్టితగిలె నేడు విభునకు
నారలతో మునిరాజగు నాడు మునుల కనుల దిష్టి
చేరువనే యుండి యుధ్ధ మారసిన వారి దిష్టి
ఊరేగి వచ్చు వేళ ఊరందరి జనుల దిష్టి
పేరుకొనెను దిష్టితీసి హారతు లీరే
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)