1, నవంబర్ 2017, బుధవారం
ఊహింప నలవిగాక యుండును
ఊహింప నలవిగాక యుండును హరిమాయ
ఆహా ఆ బ్రహ్మకైన ఆ శివున కైన
మోహిని యగు వేళ పురుషోత్తముని హరిని
మోహించి వెంటబడెను పురారాతి శివుడే
ఆహాహా ఆ శివుడే యంత తబ్బిబ్బుపడిన
దేహధారులకు హరి తెలియ వచ్చేనా
గోపాలకుడైన హరి గోవులను కొంపోయి
పాపమా బ్రహ్మయే భంగపడి కేల్మోడ్చె
ఆ పితామహున కన్ననధికులా నరులు
శ్రీపతి పెనుమాయలో చిక్కకుండుటకు
హరి రాముడైన వేళ నందరు దేవతలు
నరుదెంచి జనకసుత యగ్నిజొచ్చి నపుడు
పరమపురుష నిన్ను నీవు మరచినావనిరి
సురలెరుగని హరిలీల నరులెరుగ వశమా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)