దైవమా నీకేల దయరాదయ్యా ఏవిధి భవవార్నిధి నీదేనయ్యా |
|
కనుల కెపుడు కనరాని ఘనుడవని గమనించి మనసులోన నెంతగానొ నినుగూర్చి చింతించి పనికిరాని భోగములను భావించుట వర్జించి కొనసాగుచు నుంటిగద కొంచమైన దయరాదా |
దైవమా |
తల్లివీవు తండ్రివీవు దాక్షిణ్యమూర్తివీవు ఎల్లచుట్టాలకన్న నెక్కుడయిన వాడవీవు చల్లగాను చూచునట్టి సర్వలోకవిభుడవీవు మెల్లగ నాకిపుడు కొంత మేలుచేయ తలచరాద |
దైవమా |
సామాన్యుడనయ్య నిన్ను చాలనమ్మి కొలుచుచుంటి నీమమొప్ప రామరామ రామయనుచు పలుకుచుంటి స్వామి నిన్నె తగిలియుంటి కామాదుల వదలియుంటి శ్రీమంతుడ రామచంద్ర చింతదీర్చమనుచు నుంటి |
దైవమా |
24, సెప్టెంబర్ 2016, శనివారం
దైవమా నీకేల దయరాదయ్యా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)