తలపులు నీతత్త్వముపై నిలువనీ రామా పలుకులు నీనామముపై నిలువనీ రామా |
|
పలుగాకి పనులతో పవలు గడువకుండ ఇలలోని సంగతులే కలల నిండకుండ మెలకువలో కలలలో మెదలనీ తలనిండ తులలేని నీ నామము తొలగనీ భవము |
ఇదియే |
వట్టివి ఇహసుఖములు వట్టివి పరసుఖములు గట్టివి నీ దివ్యనామగానమహాసుఖములు పట్టి నీవు ప్రోవ నే పరవశించి యుండుటలు ఇట్టె ఇట్టె గడిచెనుగా ఎన్నెన్నో భవములు |
ఇదియే |
ధారుణిపై నుండుటలు దబ్బర జీవితములు కోరుదునా నేను నిన్ను చేరి యుంట గాక ఊరక నీవానిగా నుంచుటయే కాదు శ్రీరామ లీనమే చేసికొనుము నన్నింక |
ఇదియే |
12, సెప్టెంబర్ 2016, సోమవారం
తలపులు నీ నామముపై నిలవనీ రామా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)